రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది మన వైసిపి పార్టీయే – నేదురుమల్లి

0
589

Times of Nellore ( Venkatagiri ) – నెల్లూరు జిల్లా వెంకటగిరి నేదురుమల్లి బంగ్లాలో పండుగ వాతావరణం నెలకొంది. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వైసిపిలోకి వెళుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో జరుగుతున్న “నేదురుమల్లి అభిమానులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ సమావేశం” ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. వెంకటగిరి నియోజకవర్గం స్థాయిలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రతి నేదురుమల్లి అభిమాని పండక్కు తమ సొంత ఇంటికి వచ్చిన విధంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. వెంకటగిరిలో… నేదురుమల్లి కోటలో… నేదురుమల్లి అభిమానులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి వెంకటగిరి నియోజకవర్గంలోని నేదురుమల్లి అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ… వెంకటగిరిలో ఉన్న మా బంగ్లా, నాకు గెస్ట్ హౌస్ కాదు. అమ్మా, నాన్నలకు రాజకీయ జన్మనిచ్చిన వెంకటగిరి పుట్టినిల్లు. నేను ఇక్కడే ఉంటా ! ఇక్కడి నుండే వెంకటగిరిని మరింత అభివృద్ధి చేద్దామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బలంగా ఉన్న పార్టీ వైకాపా నే ! మనమంతా వైసిపిలో కలిసి పయనిద్దాం !! సెప్టెంబర్ మొదటివారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతిచోటా కలిసి పనిచేద్దామని, రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది మన వైసిపి పార్టీయే అని తెలిపారు.

SHARE

LEAVE A REPLY