స్టేడియంలో మంచినీటి కూలరు ప్రారంభించిన మేయరు

0
216

Times of Nellore ( Nellore ) – కార్పొరేటు సామాజిక బాధ్యతలో భాగంగా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం అని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. బ్యాంకు జిల్లా ప్రతినిధుల సౌజన్యంతో స్థానిక ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి కూలరును ఫీల్డ్ జనరల్ మేనేజరు నారాయణ్ కౌశిక్ తో కలిసి మేయరు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయరు మాట్లాడుతూ స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరాలకు హాజరవుతున్న చిన్నారులతో పాటు, అను నిత్యం శిక్షణ పొందే క్రీడాకారులు, వ్యాయామం చేసే వాకర్సు సభ్యుల సౌకర్యార్ధం రెండు వందల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఆర్వో సిస్టం మంచినీటి కూలరును బ్యాంకు వారు ఏర్పాటు చెయ్యడం ఆదర్శనీయం అన్నారు. ఇదేవిధంగా బ్యాంకు సామాజిక సేవలను విస్తృత పరుస్తూ, కార్పోరేషను ఆధ్వర్యంలోని స్కూళ్ళు, పార్కులు, మైదానాలు, మార్కెట్టులు వంటి ఇతర జన సమ్మర్ధ ప్రాంతాల్లో మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించాలని బ్యాంకు యాజమాన్యాన్ని మేయరు కోరారు. సామాజిక సేవా బాధ్యతలను ప్రణాళికాబద్ధంగా చేపడుతూ, కార్పొరేటు సంస్థలు సేవాతత్పరతలో అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ జనరల్ మేనేజరు శివ్ నారాయణ్ కౌశిక్, ఎజిఎం జవహర్, మేనేజరు మురళి, కార్పొరేటర్లు రాజా నాయుడు, ప్రశాంత్ కుమార్, వాకర్సు అంకిరెడ్డి, నరసింహారెడ్డి, బలరామయ్య నాయడు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY