చదువుకు పేదరికం అడ్డుకాదు – నగర మేయర్ అబ్దుల్ అజీజ్

0
143

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ # – నెల్లూరు మునిసిపల్ స్కూల్ లో చదివి 10 \10 జి పి ఏ సాధించించిన విద్యార్థులను నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అభినందించారు. ఈ సందర్బంగా అయన కార్పొరేషన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అయన మాట్లాడుతూ… చదువుకు పేదరికం అడ్డుకాదని ఈ విద్యార్థులు నిరూపించారన్నారు. గత ఐదేళ్లుగా నెల్లూరు కార్పొరేషన్ లో మంత్రి నారాయణ సహకారంతో విద్య లో ప్రమాణాలు పెంపొందించే విధంగా కృషి చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి అధ్యాపకులు ఉన్నారని, తల్లిదండ్రులు వారి పిల్లలను కార్పొరేషన్ స్కూల్ లో చేర్పించాలని కోరారు. ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలలో సీట్లు లేవనే బోర్డు లు పెట్టె పరిస్థితి వచ్చిందన్నారు. పదవతరగతో పాస్ అయినా వారు ఇంటర్ గురించి భయపడవలసిన అవసరం లేదని, రాష్ట్రము లో తొలిసారి ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి ఉన్నామన్నారు. విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. నెల్లూరు జిల్లాలో పదవతరగతి ఉతీర్ణులైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మేయర్ అభినందనలు తెలియజేసారు. నెల్లూరు లో 200 మంది ఫెయిల్ అయ్యారని, వారికీ ప్రత్యేక తరగతులు నిర్వహించి ఇన్స్టంట్ పరీక్షల్లో వందశాతం పాస్ వయ్యేవిధంగా కృషి చేస్తామన్నారు.

SHARE

LEAVE A REPLY