నో ఫీజు – నో స్కూల్ – మాగుంట శరత్ చంద్ర రెడ్డి

0
232

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే,దీనితో పాటుగా విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది.అయితే లాక్ డౌన్ లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఆర్థికంగా చాల ఇబ్బందులు పడుతున్నారని,అటువంటి సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ప్రైవేట్ విద్యాసంసస్థలు ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల దగ్గర అధిక ఫిజులు వసూళ్లు చెయ్యడమే కాకా లాప్టాప్,స్మార్ట్ ఫోన్ ఉండాలని చెప్పడంతో విద్యార్థులు తల్లి తండ్రులు చాల ఇబ్బందులు పడుతున్నారని,మాగుంట శరత్ చంద్ర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక భారాన్ని వాళ్లపై మోపొద్దని,అలాగే నో ఫీజు – నో స్కూల్ అని ఆయన అన్నారు. ఆలా కానీ పక్షంలో ప్రైవేట్ స్కూల్ పై తగు చర్యలు తీసుకుంటామని,ఆయన అన్నారు.

SHARE

LEAVE A REPLY