నెల్లూరు ఇసుక మాఫియా పై చర్యలు తీసుకొండి …. సీఎం జగన్ కు లేఖ !!

0
30

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ఇసుక మాఫియా ను అరికట్టడం లో జిల్లా అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని నెల్లూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ కాకర్ల తిరుమల నాయుడు అన్నారు. దామరమడుగు, శ్రీరంగ రాజపురం ఇసుక రీచ్ లలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో 1000 పోస్ట్ కార్డ్ లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి పోస్ట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామరమడుగు, శ్రీరంగ రాజపురం రీచ్ ల ఇసుక కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున అవినీతి , అక్రమాలకు పాల్పడుతున్నారు.ముఖ్యమంత్రి గారూ…. నెల్లూరు ఇసుక మాఫియా గురించి పోస్ట్ కార్డ్ ల ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాం , చర్యలు తీసుకునే దమ్ము మీకు ఉందా ? అని అన్నారు. నెల్లూరు ఇసుక మాఫియా పై కఠిన చర్యలు మరియు ప్రజాధనం రికవరీ అయ్యేంత వరకు తెలుగుయువత ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళనా కార్యక్రమాలు కొనసాగిస్తాం అని తెలిపారు.

SHARE

LEAVE A REPLY