న్యాయసేవాధికారసంస్థ ఆధ్వర్యంలో న్యాయసేవల శిబిరం..

0
217

Times of Nellore ( Nellore ) – ఈ నెల 25వ తేదీన విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో న్యాయసేవల శిబిరం నిర్వహించబడుతుందని లోక్ అదాలత్ న్యాయమూర్తి సుధారాణి తెలియజేశారు. ఈ శిబిరంలో హైకోర్టు మెంబర్ సెక్రటరీ, కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే అన్నీ విభాగాల జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. దాదాపు 20 ప్రభుత్వ విభాగాల వారు, వారి వారి స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారని అన్నారు. న్యాయసేవాధికారసంస్థ, ప్రభుత్వ అధికారులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అన్ని సమాజిక వర్గాల వారికి, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వపరంగా వారికి ప్రకటించిన పథకాలు, అవి పొందడానికి కావల్సిన ఆశావహులకు అవగాహన కల్పించడమే కాకుండా నమోదు కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు. ఈ సదావకాశాన్ని అన్ని వర్గాల వారు సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు.

SHARE

LEAVE A REPLY