సోము వీర్రాజు ను కలిసిన జిల్లా జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు

0
58

Times of Nellore –కోట సునీల్ కుమార్-నెల్లూరు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నెల్లూరు జిల్లా జనసేన నాయకులు తాడేపల్లిగూడెం లోని ఆయన స్వగృహంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనసేన ప్రత్యేక మాస్కుల ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. పవన్ కళ్యాణ్ మంచి కమిట్మెంట్ తో కూడిన విధి విధానాలతో ఉన్నారని ఆయనకు మంచి భవిష్యత్ ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జనసైనికులు పవన్ కళ్యాణ్ లక్ష్య సాధన దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు మరియు నెల్లూరు జనసైనికులు సోము వీర్రాజు కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమకు పార్టీలో మరింత ఆధిక్యత లభించి, అత్యున్నతస్థాయి పదవులు పొందాలని ఆకాంక్షించారు. బిజెపి జనసేన సమన్వయంతో రానున్న ఎన్నికల సమయంలో ఘన విజయం సాధించే దిశగా జనసేన కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు చేత నూతనంగా ఆవిష్కరించబడిన జనసేన ప్రత్యేక మాస్క్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన నాయకులు చంద్ర , జీవన్, ఇంద్ర, వికాస్ .రమేష్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY