ముస్లిం సోదరులకు మేము ఎప్పుడు అండగా ఉంటాము – కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి

0
48

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 2వ డివిజన్ జన్నత్ హుస్సేన్ నగర్ లో 45 లక్షల వ్యయంతో షాదీ మంజిల్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఎం.వి శేషగిరిబాబు, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లోని ముస్లిం సోదరులకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారు.జలవనరుల శాఖ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో 26 డివిజన్లో 17 పంచాయితీలో ఎక్కడ ఏ సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం సమస్యలన్నిటినీ పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతున్నాం మని ఆయన అన్నారు.

SHARE

LEAVE A REPLY