ఓటమి భయంతోనే టీడీపీ నేతల విష ప్రచారం – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

0
169

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – తనపై టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారంపై నెల్లూరు రూరల్‌ శాసనసభ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. తాను టీడీపీ నేతలను ఎప్పుడూ బెదిరించలేదని స్పష్టం చేశారు. సోమవారం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలను తాను బెదిరించినట్లయితే.. అప్పుడే వారు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు తిరుమల నాయుడుతో తనకు ఎటువంటి శత్రుత్వం లేదని పేర్కొన్నారు. తిరుమల నాయుడుపై దాడి జరిగిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తనపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనపై దాడికి యత్నించడం మంచి పద్దతి కాదని సూచించారు. నెల్లూరు రూరల్‌ టీడీపీ అభ్యర్థి అబ్దుల్‌ అజీజ్‌ కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తను రౌడీయిజాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదని గుర్తుచేశారు.

 

SHARE

LEAVE A REPLY