నాడు-నేడు పనులను పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

0
57

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23 డివిజన్ భక్తవత్సల నగర్ సమీపంలో ఉన్న కె. ఎన్. ఆర్ హైస్కూల్లో జరుగుతున్న నాడు -నేడు పనులను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కె. ఎన్. ఆర్ హై స్కూల్ లో 48 లక్షల రూపాయలతో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించి, జులై నెలాఖరుకల్లా విద్యార్థులకు అందుబాటులోకి తెస్తాంమని హామీ ఇచ్చారు. విద్యారంగంలో నాడు -నేడు, అమ్మ ఒడి, లాంటి అనేక పథకాలకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

SHARE

LEAVE A REPLY