కేసీఆర్ అజెండాలను ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు- చేజర్ల వెంకటేశ్వర రెడ్డి!!

0
123

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –ఆంధ్రప్రదేశ్ ను దెబ్బతీసి హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకోవాలనే కేసీఆర్ అజెండాలను ఏపీలో జగన్ అమలు చేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కోవూరులో టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయం మంచి నిర్ణయం అయితే కేసీఆర్ ముందుగా తెలంగాణాలో మూడు రాజధానులు ఏర్పాటుచేయాలన్నారు . హైదరాబాద్ లో హైకోర్టు ,వరంగల్ లో అసెంబ్లీ,ఆదిలాబాద్ లో సచివాలయం పెట్టి ఇతరులకు సలహాలు ఇవ్వాలన్నారు.

SHARE

LEAVE A REPLY