కురిచర్లపాడు గ్రామంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం

0
104

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- మనమంతా ఆరోగ్యంగా… స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుతూ… ఎలాంటి రోగాలూ లేకుండా బతకాలంటే… మన చుట్టూ మొక్కలు చెట్లూ ఉండాలి. ప్రకృతిలో ఉన్నంతకాలం మనకు ఎలాంటి అనారోగ్యాలూ రావు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నట్లే… ఇండియాతోపాటూ… తెలుగు రాష్ట్రాలూ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. ఇప్పటికే… తెలంగాణలో హరితహారం పేరుతో ఆరేళ్లుగా కోట్ల మొక్కల్ని పెంచుతున్నారు. వాటిలో చాలావరకూ చెట్లుగా మారి… తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ పచ్చదనాన్ని పెంచే ఉద్దేశంతో… వైసీపీ ప్రభుత్వం అందరం మొక్కలు నాటి… చెట్లను పెంచుదాం అనే నినాదం అందుకుంది. ఇందులో భాగంగా.. ఇవాళ 71వ వన మహోత్సవాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం అన్నీ రెడీ చేసింది. ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా, అందరూ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపేలా ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసుకుంది.పర్యావరణ నిబంధనల ప్రకారం… ఏ దేశంలోనైనా 33 శాతం అడవులు, పచ్చదనం ఉండాలి. ఆ దిశగా అన్ని రాష్ట్రాలూ పచ్చదనాన్ని పెంచాలి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊర్లలో సచివాలయం సిబ్బంది మిగతా ఉద్యోగులను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం కురిచర్లపాడు గ్రామంలోని సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ కలిసి 500 మొక్కలను నాటడం జరిగింది.

 

SHARE

LEAVE A REPLY