కావలి మున్సిపల్ పాఠశాలల్లో 10/10 మార్కులు పొందిన విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ

0
337

Times of Nellore (Kavali)  #కోట సునీల్ కుమార్ # – మంగళవారం ప్రకటించిన 10 వ తరగతి ఫలితాల్లో కావలి మునిసిపల్ పాఠశాలల్లో చదివి 10/10 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు కమిషనర్ ఎస్. కె. ఫజులుల్లా బుధవారం సైకిళ్లను బహుమతిగా అందచేశారు. తొలుత విద్యార్థులు, ఉపాద్యాయులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులకు 8వ వార్డ్ పాఠశాలలో కమిషనర్ యస్.కె.ఫజులుల్లా అభినందన కార్యక్రమం నిర్వహించారు..10 \10..మార్కులు పొందిన..ఆర్.శ్రీజ, కె.జనని దుర్గ, యస్.కృష్ణ గీత లకు సైకిల్స్. మరియు 9.పాయింట్లు దాటిన 30 మందికి వాచీలు అందచేశారు. ఈ సంధర్భంగా కమీషనర్ మాటలాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవంగల ఉపాధ్యాయులు ఉన్నారని ఉచిత విద్యతో పాటు మంచి వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.అలాగే విద్యార్థులు కూడా మంచిఫలితాలు సాధిస్తున్నారని కావున తల్లితండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు కోరారు. ఉపాధ్యాయులు కూడా క్యాంపెన్స్ మరియు ప్రచారం నిర్వహించాలన్నారు.10 పాయింట్లు సాధించిన. శ్రీజ, అనుప్రియ లు మాటలాడుతూ విద్యార్థులు అందరు కష్టపడి చదవాలని, ఉపాధ్యాయుల సలహాలు సూచనలు పాటిస్తే మంచిఫలితాలు అందరూ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY