మమ్మల్ని రక్షించండి ప్రభు..!

0
87

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరుకు చెందిన 30 మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ లో చిక్కుకున్నారు. దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్ డౌన్ తో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో నెల్లూరీయులు స్వస్థలాలకు రాలేక కాశీలోనే ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలోని పెద్ద బజారు ప్రాంతానికి చెందిన సుమారు 30 మంది ఈ నెల 15వ తేదీనా కాశీతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాలను తిలకించేందుకు తీర్ధయాత్రలకు బయలుదేరి వెళ్లారు. అన్నీ ఆలయాలను దర్శించుకుని ఈ నెల 21న ఉత్తరప్రదేశ్ లోని కాశీ కి చేరుకున్నారు. కాశీ ఆలయాన్ని దర్శన అనంతరం వారు అదే రోజు తిరుగు ప్రయాణం రావల్సి ఉంది.

అయితే 22వ తేదీ ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కు పిలుపునివ్వడంతో అక్కడి అధికారులు వీరి ప్రయాణాన్ని అడ్డుకున్నారు. 22వ తేదీ జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే రైళ్ల రాకపోకలకు పూర్తిగా నిలిపివేయడం, రోడ్లపై వాహనాల రాకపోకలకు నిషేధించడం జరిగిపోయింది. దీంతో కాశీలో ఉన్న నెల్లూరీయులు స్వస్థలాలకు వచ్చే వీలు లేకుండా పోయింది. దీంతో వారంతా ఓ హోటల్ లో తలదాచుకుంటూ బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కువ మంది వృద్ధులు కావడంతో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సరిగా తిండి లేక అల్లాడుతున్నారు. ఈ విషయం పై నెల్లూరులోని వారి బంధువులు జిల్లా కలెక్టర్ కు వాట్స్ యాప్ ద్వారా సమాచారం అందించారు. అంతే కాకుండా వారు పంపిన వీడియో సందేశాన్ని కూడా కలెక్టర్ కు ఫార్వార్డ్ చేశారు. తమ వారిని కాశీ నుండి నెల్లూరుకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని వేడుకొంటున్నారు.

SHARE

LEAVE A REPLY