కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు సేవ దృక్పదంతో ముందుకు రావాలి – గంగాధర్

0
175

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరు సేవ దృక్పదంతో ముందుకు రావాలని గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగాధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమణ మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా విశాలాక్షి వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో వృద్ధుల ఆకలి తీర్చాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు స్నేహితులు, శ్రేయోభిలాషులు ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆశ్రమంలోని వృద్ధులకు మూడుపూటలా అన్నదానం నిమిత్తం పదివేల రూపాయలు ఇచ్చిన మిత్రులు రమణను ప్రత్యేకంగా అభినందించారు.

SHARE

LEAVE A REPLY