జిల్లా చరిత్రలో అద్భుత విజయం – కాకాణి

0
185

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ #  – ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి కి, వైసీపీ కి చారిత్రాత్మక విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ప్రధాన కార్యాలయం లో అయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నెల్లూరు జిల్లా చరిత్రలో మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఒకే పార్టీకి కట్టబెట్టడం ఒక చరిత్రన్నారు. యువ ఎమ్మెలేలు అనిల్ కుమార్ , మేకపాటి గౌతమ్ రెడ్డి లకు మంత్రి పదవులు దక్కడం ముదావహమన్నారు. యువమంత్రుల తో కలసి కట్టుగా పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడతామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సంయుక్త సహకారంతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఎన్నికల్లో ఘనవిజయాన్ని అందించడానికి కృషి చేసిన జిల్లా నాయకులకు , కార్యకర్తలకు, ప్రజలకు కాకాణి కృతఙ్ఞతలు తెలిపారు.

SHARE

LEAVE A REPLY