అయిదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి దగ్గర మేము ఏమి నేర్చుకోవాలి

0
38

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వైసిపి జిల్లా ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా అయిదుసార్లు ఓడిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి దగ్గర తాము నేర్చుకోవాలా? అని ఎద్దేవా చేశారు. గతంలో మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్న చరిత్ర సోమిరెడ్డిదని వ్యాఖ్యానించారు. రైతులని రెచ్చగొడుతూ విమర్శలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్ , విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY