ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారు – ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష

0
792

జూన్ 16 ( నెెల్లూరు ) – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారయింది. ఈనెల 18వ తేదీనా ఆయన నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా సిఎం చంద్రబాబు కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం వద్ద నిర్మించనున్న ఎయిర్‌పోర్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు బీదా మస్తాన్ రావు కొత్తగా నిర్మించిన రొయ్యల మేత ఫ్యాక్టరీ ని ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. తర్వాత నెల్లూరు లోని కనుపర్తిపాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడే ఉండే విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే తెలుగుదేశంపార్టీ సమావేశంలో మాజీ వైసీపీ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టిడిపిలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం సమీపంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపిఆర్ ఉచిత విద్య పాఠశాలను, విపిఆర్ ఉచిత వైద్యం భవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడే మధ్యాహ్నం భోజనం తర్వాత ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంకికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంను ప్రారంభిస్తారు. తర్వాత అక్కడే రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల మంత్రులు కూడా పాల్గొంటారు.

సిఎం పర్యటనా ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష –
మరో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్ ఎమ్.జానకి అన్నీశాఖల అధికారులతో సమీక్షను నిర్వహించారు. పలువురి అధికారులకు బాధ్యతలను అప్పగించారు. సిఎం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఏక్కడ ఏ చిన్నపొరపాటు జరిగినా ఊరుకునేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

SHARE

LEAVE A REPLY