జర్నలిస్టులను, న్యూస్ రీడర్స్ ను, ఉపాధ్యాయులను సన్మానించిన లయల్స్ క్లబ్ ఆఫ్ ప్రియదర్శిని

0
1059

Times of Nellore ( Nellore ) – లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకినిలో అంతర్భాగమైన మహిళా విభాగం ప్రియదర్శిని క్లబ్ సామాజిక సేవలో అందరికీ స్పూర్తిగా నిలుస్తోంది. ప్రియదర్శిని అధ్యక్షురాలు చెవులు సుప్రియ, కార్యదర్శి అయితా సంధ్యారాణి, ట్రెజరర్ జూటూరు సుమలతలు ప్రియదర్శిని క్లబ్ ను ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా వీరు సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే మహిళా జర్నలిస్టులను, జర్నలిస్టులు రాసే వార్తలను చక్కగా ప్రజలకు వివరించే మహిళా న్యూస్ యాంకర్స్ ను, భావి భారత పౌరులను సమాజానికి అందించే మహిళా ఉపాధ్యాయులను సత్కరించి సమాజిక సేవలో తన వంతు కృషిని నిరూపించుకున్నారు. నెల్లూరులోని హోటల్ అతిధిలో జరిగిన కార్యక్రమంలో భాగంగా మహిళా జర్నలిస్టులు సరస్వతి, సరళ, శ్రీకీర్తిలను సత్కరించి వారి సేవలను కొనియాడారు. అలాగే వార్తలను ప్రజలకు తెలియజేసే ఏసిటి న్యూస్ ఛానల్ యాంకర్స్ షేక్ బషీరున్నీసా, కావలి మేరీ సుజిత, అచ్యుతాలను కూడా సత్కరించారు. ఇద్దరు ఉపాధ్యాయులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని క్లబ్ అధ్యక్షురాలు చెవులు సుప్రియ మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో మహిళలు కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా వృత్తిలో సవాళ్లను ఎదుర్కొంటూ జర్నలిజంలో నెట్టుకురావడం చిన్నవిషయం కాదన్నారు. పాత్రికేయ యాజమాన్యాలు కూడా మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జర్నలిస్టులు అందించే వార్తలను చక్కగా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో తెలియజేసే న్యూస్ రీడింగ్ రంగంలో కూడా మహిళలు తమదైన ముద్రను వేసుకుంటున్నారని అభినందించారు. కార్యక్రమం అనంతరం క్షయ వ్యాధి బాధితులకు పౌష్టికాహారాన్ని అందించారు.

SHARE

LEAVE A REPLY