జిల్లా పోలీసు కార్యాలయములో ఘనంగా విజయదశమి వేడుకలు !

0
97

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా యస్.పి. శ్రీ ఐశ్వర్య రాస్తోగి ఉదయం యస్.పి.బంగ్లాలో, జిల్లా అర్మేడ్ ఫోర్స్ కార్యాలయంలో మరియు మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లలో పోలీసు ఆయుధాలకు మరియు పోలీసు వాహనాలకు ఘనంగా పూజలు నిర్వహించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆయుధ పూజ పురాతన కాలము నుండి అనాదిగా ఆచరిస్తున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, అది చెడుపై విజయానికి నాందిగా విజయదశమి నిర్వహించుకుంటారు అని, పోలీసులు అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ పోలీస్ అధికారులు ఆయుధ పూజలు నిర్వహిస్తూ ఉంటారని తెలియజేసారు . సాయుధ పోలీస్ కార్యాలయంలో ఘనముగా పూజలను నిర్వహించి పోలీసు అధికారులందరికీ ఈ సందర్బంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లో పూజలను నిర్వహించి జిల్లాకు నూతనంగా వచ్చిన వజ్ర వాహనము ను ఎస్పీ ప్రారంభించారు. ఈ వాహనం యొక్క ప్రత్యేకత లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగి ఉండి, బంద్ లు, రాస్తారోకోలు సందర్భంగా అల్లరి మూకలు చెదరగొట్టడానికి ఎలక్ట్రిక్( టియర్) భాష్ప వాయువు ను కలిగి ఉంటుందని, సదరు వాహనంలో అల్లరి ముకాలను చెదరగొట్టడానికి రబ్బర్ బుల్లెట్లు కలిగి ఉన్నట్లు, ప్రజల యొక్క ఆస్తి, ప్రాణ నష్టాన్ని అరికట్టుట చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఏ.అర్. అదనపు ఎస్పీ శ్రీ వీర భద్రుడు , టౌన్ డి.యస్.పి. జె.శ్రీనివాసులు రెడ్డి , వెల్ఫేర్ ఆర్.ఐ. చంద్ర మోహన్ , ఆర్.ఐ. అడ్మిన్ మౌలుద్దీన్ , యామ్.టి.ఓ. గోపీనాధ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY