జోరందుకుంటున్న జనసేన పార్టీ ప్రచార కార్యక్రమం

0
466

Times of Nellore ( Udayagiri ) – ఉదయగిరి నియోజకవర్గం, జలదంకి మండలంలోని జనసేన నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య ఆధ్వర్యంలో స్థానిక ఆర్.టి.సి. బస్టాండ్ సెంటర్ నందు బుధవారం జనసేన పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత మేలుకో.. మార్పు కోరుకో.. అంటూ కరపత్రాలు పంచుతూ, ముందుకు సాగారు. నెల్లూరుజిల్లాలో జనసేన పార్టీ ప్రచార కార్యక్రమం జోరందుకుంటుంది. ఈ కార్యక్రమంలో జనసేన యువత నాయకులు ముక్కిరి కోటేశ్వరరావు, మోదుగ హరీష్, జానీ, మలిశెట్టి శ్రీధర్, రఘు, వేణు, గుర్రం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY