జనసేనతోనే రాష్ట్రాభివృద్ధి – కేతంరెడ్డి వినోద్ రెడ్డి

0
94

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచి రాష్ట్రాభివృద్ధిలో ప్రతిఒక్కరు పాలుపంచుకోవాలని కోరారు ఆ పార్టీ నెల్లూరు జిల్లా నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జనసేన, జనబాటలో భాగంగా ఐదోరోజు నగరంలోని 4వ డివిజన్ పరిధిలో పర్యటించారు కేతంరెడ్డి. ఇక్కడి రాజీవ్ గాంధీ నగర్, దీన్ దయాల్ నగర్ , గాండ్ల వీధి లలో తిరిగి స్థానిక సమస్యలను తెలుసుకుని, జనసేన విధివిధానాలను స్థానికులకు వివరించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని, సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాల్గొన్నారు. ప్రజలకు జనసేన భావాలను కేతంరెడ్డి వినోద్ రెడ్డితో కలిసి వివరించారు. ప్రధానంగా నిరుపేదలు నివసించే ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ఎంతవరకు వారికి అందుతున్నాయి, వారి సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి జనసేన తిరుగుంతుందన్నారు. వాడవాడల్లో జనసైనికులు ఉన్నారని, తాము ప్రజలకు వారధిగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాను పర్యటించిన ఈ ప్రాంతంలో నిరుపేదలు అనేకమంది ఉన్నారని, వారికి ప్రభుత్వ పథకాలు సరిగా అందడం లేదన్నారు. రాష్ట్రంలో సమస్యలు అనేకం ఉన్నా…. అటు ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్షానికి కానీ పట్టడం లేదని, అందుకోసమే పవన్ జనసేన స్థాపించారన్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని గుర్తు చేశారు. పవన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని, ప్రతి ఒక్కరు జనసేనలో సభ్యులుగా చేరాలని కోరారు. వాడవాడల్లో జనసేన తన పర్యటన కొనసాగిస్తుందని, తరంగం కార్యక్రమం ద్వారా మరింత ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరంపూడి కృష్ణా రెడ్డి, ఏటూరి రవి కుమార్, ప్రవీణ్ యాదవ్, కొలపల్లి దివాకర్, సన్నీ, సాయి, ప్రభాకర్ స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY