కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ

0
745

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని సత్యనారాయణపురంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. జనబాట కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ జెండాను జిల్లా వ్యాప్తంగా ఆవిష్కరించి, అందరం కలిసికట్టుగా జనసేన పార్టీని బలోపేతం చేసి.. 2019లో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, కొట్టె వెంకటేశ్వర్లు, రాజేశ్వరమ్మ, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY