నూతన ఇన్ పేషెంట్ విభాగాన్ని తనిఖీ చేసిన చాట్ల నరసింహారావు

0
299

Times of Nellore ( Nellore ) – నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోని నూతన ఇన్ పేషెంట్ విభాగాన్ని అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చాట్ల నరసింహారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఈ భవనంలో మొదటి రెండు అంతస్థులలో జనరల్ మెడిసిన్, రెండవ అంతస్థులో జనరల్ సర్జరీ విభాగాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. మూడవ అంతస్థులో 10 ఆపరేషన్ థీయేటర్ లు తయారవుతున్నాయని అన్నారు. నాలుగవ అంతస్థులోని ఆర్థో (కీళ్ళు, ఎముకలు) విభాగానికి సంబంధించి 120 బెడ్లు, ఐసీయు లో 18 బెడ్లు, 10 పే రూమ్స్ జనరల్, 32 డబుల్ రూమ్స్, 240 సీట్లు కలిగిన గ్యాలరీ తయారు చేయించడం జరిగిందన్నారు. అన్ని బ్లాకులను సిద్ధం చేసి ఈ నెల 28వ తేదీన పేషెంట్ లను పాత భవనం నుండి కొత్త భవనంలోకి మార్చడం జరుగుతుంది. ఆర్థో విభాగానికి సంబంధించి 1 ప్రోఫెసర్, 1 అసోసియేట్ ప్రోఫెసర్, 4 అసిస్టెంట్ ప్రోఫెసర్లు, 9 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 24 గంటలు ఈ విభాగంలో సేవలు అందిస్తారని చాట్ల నరసింహారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో సూపర్నెంట్ డా. రాధాకృష్ణరాజు, అడ్మినిస్ట్రేటర్ డా. కళారాణి, ఆర్థో డాక్టర్లు ముఖర్జీ, మస్తాన్ బాషా, సభ్యురాలు బీవి లక్ష్మీ పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY