పేలుడు క్షతగాత్రులను పరామర్శించిన జగన్

0
1708

Times of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాణాసంచా పేలుడు క్షతగాత్రులను పరామర్శించేందుకు నెల్లూరులోని మంత్రి నారాయణకు చెందిన నారాయణ హాస్పిటల్ కు వచ్చిన జగన్ క్షతగాత్రులను పరామర్శించి, అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఇప్పటి వరకూ 6 మంది చనిపోయి, మరో 10మంది చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. అవే ఉంటే వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇచ్చి ఉండే వారని జగన్ వ్యాఖ్యానించారు. అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతోనే జరిగిందని, బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు వచ్చి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా బాసటగా నిలవాలని సూచించారు.

SHARE

LEAVE A REPLY