ప్రభుత్వ ఆసుపత్రి ఖైదీల వార్డులో బెడ్ ల సంఖ్య పెంపు…

0
219

Times of Nellore ( Nellore ) – నెల్లూరు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలోని పాత డిఎస్ఆర్ ఇన్ పేషెంట్ విభాగాన్ని నూతన భవనంలోకి మార్చారు. పాత భవనంలో మొదటి అంతస్థులో గల ఖైదీల వార్డు కూడా మార్చేందుకు జైలు సూపరింటెండెంట్ రవికిరణ్, డిప్యూటి సూపరింటెండెంట్, ఇతర సిబ్బంది తో కలసి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు భవనాన్ని పరిశీలించారు. ఖైదీల వార్డ్ లో బెడ్ ల సంఖ్య కూడా పెంచుతున్నామని పేర్కొన్నారు. మంచి వాతావరణం, మంచి వైద్యం ఖైదీలకు కూడా ఇవ్వాలని ఈ మార్పులు చేస్తున్నామని చాట్ల నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. రాధాకృష్ణ రాజు, ఆర్ఎంఓ డా. వరప్రసాద్, డా. కళారాణి, సభ్యులు బి.వి లక్ష్మి, జైలు డా. ఖధర్ వలి, డా. వసంత్, డా. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY