శివారు కాలనీల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాను – ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
323

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు 22, 23వ డివిజన్ లలోని బ్యాంక్ కాలనీ, బి.వి. నగర్ లలో పర్యటించారు. అద్వాన్నపు రోడ్లతో, డ్రైన్ లతో బ్యాంక్ కాలనీ ప్రజలు పడుతున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఇంత అద్వాన్నపు రోడ్లతో, మురికి నీళ్ళతో జనం అల్లాడుతుంటే, కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. శివారు కాలనీలలో రోడ్లు, డ్రైన్లు, కరెంటు, మంచినీటి సమస్యలతో జనం అల్లాడుతున్నారని, జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వలసలు వస్తున్న ప్రజలు శివారు కాలనీలలో స్థిరనివాసాలు ఏర్పరచుకుంటున్నారని జనావాసాలతో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న శివారు కాలనీలలో అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఎలాంటి అధికారం లేకున్న ఒకటికి పదిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతూ, శివారు కాలనీల అభివృద్ధి పనుల సాధనకోసం అభ్యర్థనలు, నిలదీతలు, ఉద్యమాలతో శివారు కాలనీల అభివృద్ధి పనుల పోరాడుతున్నానని చెప్పారు.

బురదలో ఇరుకున్న ఆటోని స్థానికులతో కలసి తోసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడే సమయంలో కూలీలను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో బ్యాంకు కాలనీ అద్వాన్నపు రోడ్లతో ఇరుక్కొని రోడ్లతో కదలలేని పరిస్థితికి వచ్చింది. దీనిని గమనించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానికులతో కలసి ఆటోని చేతులతో తోసి, బయటకు తీసుకువచ్చారు. బ్యాంక్ కాలనీ అద్వాన్నపు రోడ్లతో స్థానిక ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు ఇదొక ఉదాహరణ అని చెప్పారు.

SHARE

LEAVE A REPLY