ప్రపంచ శాంతికి రంజాన్‌ దీక్షలు

0
169

Times of Nellore ( Nellore ) – పవిత్ర రంజాన్‌ ఉపవాసాలను పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నగరంలోని కస్తూరిదేవిగార్డెన్స్‌లో మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ అధ్యక్షతన ఇఫ్తార్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ విందులో పాల్గొని ప్రార్థనలు చేశారు. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ చేతుల మీదుగా 124 మసీదుల అభివృద్ధి, రంజాన్‌ పండుగ ఏర్పాట్లకు రూ.50 లక్షలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మేయర్‌ మాట్లాడుతూ ప్రపంచ, దేశ, రాష్ట్ర శాంతికి ముస్లింలు రంజాన్‌ నెలలో దీక్షలు చేస్తారన్నారు. పేదరికాన్ని జయించేందుకు తమ పిల్లలను చదివించాలని తెలిపారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ జిల్లాలోని అక్కచెరువు పాడు వద్ద ముస్లిం పిల్లలకు రెసిడెన్షియల్‌ పాఠశాలతో పాటు ముఖ్యమంత్రి బారాషహీద్‌ దర్గా అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేశారన్నారు. ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ పిల్లలను చదివించాలని, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆకాంక్ష మేరకు బాలికల కోసం జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాయకులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, చాట్ల నరసింహారావు, ఆనం జయకుమార్‌రెడ్డి, అనూరాధ, పరసా రత్నం, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY