ఉపవాసకులకోసం ‘హోటల్ రియాజ్’ వారి సేవలు ఆదర్శనీయం – మేయరు అబ్దుల్ అజీజ్ 

0
497

Times of Nellore ( Nellore ) – పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం యువతకు ఉచిత భోజన సదుపాయాన్ని అందిస్తున్న ప్రముఖ ‘హోటల్ రియాజ్’ యాజమాన్యం సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్థానిక హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని హోటల్ యజమాని రియాజ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ముస్లిం విద్యార్ధులూ, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన నిర్వాసితులకు సహరీ భోజనం అందించడం దైవ కార్యంగా భావిస్తూ గత 18 ఏళ్ళుగా రియాజ్ అద్వితీయమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రతినిత్యం ఉదయం మూడు గంటలనుంచి సుమారు వెయ్యి మందికి పైగా ప్రజలకు నెల రోజుల పాటు భోజనం అందించడంలో హోటల్ సిబ్బంది పాత్ర ఎనలేనిదని మేయరు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి, టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నే సాహెబ్, రియాజ్, ఎస్బీటి చాన్ బాషా, షంషుద్దీన్, మౌలానా, సుభాహాన్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY