ఆసుపత్రిలో బాంబు కలకలం…..

0
656

Times Of Nellore ( Udayagiri ) – ఆసుపత్రిలో బాంబు ఉన్నట్లు తెలియడంతో ఉదయగిరి పట్టణంలో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక వేణు నర్సింగ్‌హోంలోని మొదటి అంతస్తు బాత్‌రూంలోని బేసిన్‌లో టేపుతో చుట్టిన వస్తువును అదే నర్సింగ్‌లో పనిచేస్తున్న కాంపౌండర్‌ దాదా గుర్తించాడు. దానిలోంచి వైర్లు కనిపిస్తుండడంతో భయపడి, వైద్యశాల నిర్వాహకుడు వేణుకు సమాచారం అందించాడు. విషయం తెలియడంతో భయబ్రాంతులకు గురైన సిబ్బంది, రోగులు బయటకు పరుగు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని బాణాసంచా తయారీ నిపుణుల సాయంతో దానిని బయటకు తీయంచి నీళ్ల బకెట్‌లో భద్రం చేసి, జన సంచారం లేని ప్రాంతంలోకి తరలించారు. అనంతరం పోలీసులు వైద్యశాలను తనిఖీ చేసి, సిబ్బందిని విచారించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించేందుకు సిబ్బందితో చర్చించారు. అనంతరం నెల్లూరునుంచి వచ్చిన బాంబు స్క్వాడ్‌ అధికారులు, ఆ వస్తువును పరిశీలించి టపాకాయలుగా తేల్చడంతో ఊపిరిపీల్చుకున్నారు. కలకలం సృష్టించేందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY