నెల్లూరులో ఉద్రిక్తత.. పోలీసులు లాఠీఛార్జ్

0
175

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – నగరంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆఫీస్‌ ఎదుట టీడీపీ ఆందోళన చేపట్టింది. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత తిరుమలనాయుడి హత్యకు ప్రయత్నించిన వారిని.. పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేయాలని మహిళలు, టీడీపీ నేతల డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసుల లాఠీఛార్జ్‌ చేశారు. పలువురు కార్యకర్తలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

SHARE

LEAVE A REPLY