ఆనందలహరి పాఠశాల సందర్శన

0
109

Times of Nellore  Gudur) సూర్య –  వాకాడు మండలంలో రిషి వ్యాలీ విద్యా విధానం, ఆనందలహరి అభ్యసనం అమలుపరుస్తున్న గంగన్న పాలెం, అంజలాపురం మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాలలను ఆనందలహరి అభ్యసన మాస్టర్ కోచ్ వాసిలి సురేష్ సందర్శించారు.
ఈ పాఠశాలల నందలి బోధనాభ్యసన తీరును పరిశీలించారు. వర్క్ బుక్స్ వినియోగం, స్టూడెంట్ మరియు టీచర్ల ట్యాబ్ లు వియోగం, పప్పెటరీ, స్వయం అభ్యసన కార్డులు వినియోగమును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మరింత మెరుగ్గా అమలు పరిచి ఆనందలహరి అభ్యసన కార్యక్రమాన్ని విజయవంతం నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు మస్తానయ్య భవాని హరి పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY