వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు !

0
102

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –గూడూరు పట్టణంలోని పట్టణ పరిధిలో ఉన్న పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగం  నిలయం, శ్రీ విజయదుర్గా దేవి ఉప పీఠం నందు వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ పర్యవేక్షణలో వేద పండితుల ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం శ్రీ సర్వానంద మయ చక్ర స్వామిని శ్రీ మహా త్రిపుర సుందరి దేవి స్వరూప శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం మరియు సాయిబాబా మహాసమాధి చెందిన సందర్భంగా ప్రత్యేక పూజలు కలశ ఉద్యాసన, మహా పూర్ణాహుతి, అమ్మవారికి అభిషేకాలు భక్తి శ్రద్దలతో వేద పండితులఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి సత్సంగం నిలయం నిర్వాహకులు కోట ప్రకాశం దంపతులు, నవావరణ హోమ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

SHARE

LEAVE A REPLY