గూడూరులో టీడీపీ నేతలు ధర్నా !!

0
53

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒–కరోనా వైరస్ లాక్ డౌన్ లో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో గూడూరు, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ నాయకులు నల్ల మాస్క్ లు ధరించి, నల్ల బ్యాడ్జి లతో నిరసన చేపట్టారు. కరోనా లాక్ డౌన్ లో విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. పెరిగిన విద్యుత్ బిల్లుల వివరాలను వివరించి ఈఈ సోమశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ బిల్లులు అధికారులు వేస్తున్నారా లేక దెయ్యాలు రాత్రి సమయంలో బిల్లులు వేస్తున్నాయా అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర అన్నారు. జిల్లా లో జిల్లా కలెక్టర్, ఎస్పీ లకే రక్షణ లేదని అన్నారు.

SHARE

LEAVE A REPLY