రత్నమ్మ నర్సింగ్ కళాశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలి – T.N.S.F జిల్లా కార్యదర్శి అసనాపురం వెంకటేష్!!

0
84

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –గూడూరు తెలుగుదేశం కార్యాలయంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి అసనాపురం వెంకటేష్ ఆధ్వర్యం లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు లో ఒక ప్రముఖ డాక్టర్ గారికి చెందిన రత్నమ్మ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న సౌరబ్ ప్రసాద్ నాలుగురోజుల క్రితం నీటి కాలువలో పడి చనిపోవడానికి కారణం కళాశాల యొక్క యాజమాన్యం నిర్లక్ష్యం అని తెలియజేసారు. ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఎంతో నమ్మకం తో కేరళ రాష్ట్రం నుండి ఇక్కడ ఉన్నత చదువులకోసం పంపి ఆ పిల్లోడిని ప్రయోజకుడిని చెయ్యాలని ఇక్కడ చేర్పిస్తే ఈ కళాశాల అభద్రత వలన అతని ప్రాణాలు పోయాయని తెలియజేసారు. విద్యార్థుల నుండి అధిక మొత్తము లో ఫీజులు తీసుకొంటున్న వాళ్ళు ఉండటానికి వసతి మరియు ఆహారం నామమాత్రంగానే ఉందిని , రేకుల షెడ్లలో వసతి కల్పించటం దారుణం అని తెలియజేసారు. ఆ కళాశాల పెట్టి ఇన్ని రోజులు అవుతున్న హాస్టల్ కి వార్డెన్లు , వచ్చమెన్ లు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వలన ఒక నిండు ప్రాణం పోయింది అని తెలియజేసారు.

అలాగే ఎప్పుడు వరదలు వచ్చిన మునిగిపోయే మునకప్రాంతం నడి బొడ్డున పంబలేరు ఆనుకొని ఈ కళాశాల నిర్మించడానికి D.M.H.O వాళ్ళు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించాడు. అర్ధరాత్రుల్లో వరద ఉధృతి ఎక్కువైతే కొన్ని నిముషాలు వ్యవధిలోనే ఆ ప్రాంతం మొత్తం మ్యూనిగిపోతుందని అలానే జరిగితే ఎంతో ప్రాణనష్టం జగిరిగే అవకాశం ఉందని తెలియజేసారు . దీని మీద గూడూరు సబ్ కలెక్టర్ స్పందించి కళాశాల అనుమతులను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు N.వెంకటేష్ , నవీన్ చంద్ర , సాయి , సి.హెచ్ .శ్రీను , చల్ల శ్రీను , చందు , శంకర్ , తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY