చందన అలంకారంలో నృసింహుడు

0
153

Times of Nellore (Gudur) # సూర్య # – హిరణ్యకశిపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతింపచేయడం దేవతల వల్ల కాలేదు. చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి, శాంతించి లక్ష్మీనరసింహునిగా దర్శనమిస్తాడు విష్ణుమూర్తి. ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే, తనని కొలిచిన ప్రతి భక్తునీ అదుకుంటానని అభయమిస్తాడు. ఆ నృసింహుని జయంతి నాడు నృసింహ మూర్తిని పూజిస్తే, జీవితంలోని అవాంతరాలన్నీ తొలగిపోతాయని చెబుతారు.నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ‘ఓం నమో నారసింహాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు.

నృసింహ జయంతి ప్రత్యేక పూజలలో భాగంగా గూడూరు శ్రీ సాయి సత్సంగ నిలయం లో శుక్రవారం రాత్రి స్వామి వారు చందన అలంకారం లో దర్శనమిచ్చారు. కోటసునీ కుమార్ స్వామి ఆధ్వర్యంలో కోట ప్రకాశం దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి తరించారు.

SHARE

LEAVE A REPLY