200 రూపాయలకే మునిసిపల్ తాగు నీటి కొళాయి – కమిషనర్ ఓబులేషు

0
105

Times of Nellore (Gudur) – కోట సునీల్ కుమార్: తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కేవలం 200 రూపాయల ద్వారా మునిసిపల్ తాగు నీటి కొళాయి కనెక్షన్ పొందవచ్చునని గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేషు వెల్లడించారు . గురువారం గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు .

గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు . మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఓబులేషు మాట్లాడుతూ బిపిఎల్ కుటుంబాలకు పాత జీవో నెంబర్ 159 ఆధారంగా 200 రూపాయల డిపాజిట్ తో ఐదు వందల రూపాయల లోపు మున్సిపల్ టాక్స్ కడుతున్న వారికి మున్సిపల్ శాఖ తాగు నీటి కొళాయి కనెక్షన్ అందజేస్తుంది . అయితే ఈనెల ఆరో తేదీన ఆ జిఓ అనుసరిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది . దీని ప్రకారం కేవలం తెల్ల రేషన్కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు 200 రూపాయల డిపాజిట్ ద్వారా త్రాగు నీటి కనెక్షన్ పొందవచ్చునన్నారు . అదేవిధంగా పీఎస్ఆర్ ట్రస్ట్ వారు పేదలకు డిపాజిట్ సొమ్మును చెల్లించేందుకు ముందుకు రావడం జరిగిందని ఆయన తెలిపారు కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీటి కనెక్షన్ పొందాలని కోరుతున్నామన్నారు కనెక్షన్ కావలసినవారు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు .

SHARE

LEAVE A REPLY