సేవ చేయడం మా బాధ్యత

0
144

Times of Nellore –✒- శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గ పీఠాధిపతులు గాడ్ దివ్య ఆశీస్సులతో సమరసత సేవా ఫౌండేషన్ ,సేవా భారతి, ఆశ్రయా ఫౌండేషన్ ,ఏబీవీపీ,పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ,సాయి సత్సంగ నిలయం సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలు 100 వ రోజుకు చేరుకున్నాయి మార్చి 13 వ తేదీ నుండి గిరిజన కాలనీలో నిత్యావసర సరుకులు పంపిణీ తో ప్రారంభమైన సేవా కార్యక్రమాలు మాస్కులు పంపిణీ పట్టణంలో నిరాశ్రయులకు భోజనం ప్యాకెట్లు అందజేయడం ఆరోగ్య సమస్యలు వారికి ఆర్థిక సహాయం అందించడం రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మే నెల 17వ తేదీ నుండి జాతీయ రహదారిపై ఇతర రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికులకు ప్రతిరోజు ఆహారాన్ని అందజేస్తూ నేటితో 100వ రోజు కొనసాగాయి ఈ ముగింపు కార్యక్రమానికి గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ,డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గోపీచంద్,అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ మధుసూదన్ రావు,చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు,ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు యుగంధర్ జీ, పూర్ణ,చంద్ర నిల్,సూర్య, తిగల చంద్రశేఖర్,సాయి,సతీష్, వెంకటేశ్వర్ల,జనార్ధన్,సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గత 100 రోజులుగా కోట సునీల్ కుమార్ స్వామి అలుపెరగని సేవలను ప్రజలకు అందించారని ఆయన చేసిన సహాయ కార్యక్రమాలకు నిర్వాహకు లు కోట సునీల్ కుమార్ ను సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ అభినందించారు. అనంతరం కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ సేవ అనేది మన బాధ్యత అని ప్రతిఒక్కరు సేవా దృక్పధంతో ముందుకు వెళ్లాలని,మనం చేసే ప్రతి మంచి పని కి ఫలితం లభిస్తుందని ఆయన తెలియాజేశారు.

SHARE

LEAVE A REPLY