గూడూరు శ్రీ సాయి సత్సంగ నిలయంలో కార్తీకమాస విశిష్ట పూజలు!!

0
163

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయంలో కార్తీకమాస పౌర్ణమిని పురస్కరించుకొని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఐదు రోజులు కూడా శివునికి అత్యంత భక్తితో స్వామివారికి వైభవంగా పంచాగ్నిక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి త్రిశతి, శ్రీ పార్వతి పరమేశ్వరులకు మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

SHARE

LEAVE A REPLY