గూడూరు లో ప్రపంచ జనాభా దినోత్సవం

0
99

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ప్రపంచ జనాభా దినోత్సవం మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను గూడూరు పట్టణంలోని రోటరీ క్లబ్ నగర్ లో నిర్వహించారు.ప్రపంచ జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రతి ఏడాది జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ కృష్ణ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 2010 జనాభా లెక్కల ప్రకారం ఏడు వందల కోట్లు దాటగా ప్రస్తుతం 800 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారని అయితే 2050 సంవత్సరం నుంచి ప్రపంచ జనాభా సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రపంచ నిపుణులు అంటున్నారని ఆయన తెలిపారు.
ఏదేమైనా ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా ప్రపంచ జనాభాలో కొంతమేర ఆ మహమ్మారి సోకి చనిపోవడం జరుగుతుందని ఆయన అన్నారు.గతంలో ప్రభుత్వాలు ఒక బిడ్డ ముద్దు అనే నినాదం అవలంభించే వారిని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకుడిగా పనిచేసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామానికి చెందిన దువ్వూరు శ్రీనివాసులురెడ్డి జన్మదినోత్సవ వేడుకలను కూడా ప్రజల మధ్య నిర్వహించారు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి రోటరీ క్లబ్ ప్రజలకు పంపిణీ చేశారు.అనంతరం కరోనా వైరస్ పై ఆ ప్రాంత వాసులకు గిరిజన కాలనీవాసులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిశుభ్రత పాటించాలని అవసరం ఉంటే నీ ఇంటి నుంచి బయటకు రావాలని బయటకు వస్తే విధిగా మాస్క్ ధరించాలని ఎం వి రావు పౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహనం కృష్ణ కోరారు.ప్రతి ఒక్కరిలో వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే నిమిత్తం ఆయుష్ శాఖ సూచించిన ఆర్సోనికేం ఆల్బమ్-30 అని హోమియో మందులను తప్పనిసరిగా వాడాలని ఆయన తెలిపారు అనంతరం రోటరీ క్లబ్ కాలనీవాసులకు ప్రతి ఒక్క కుటుంబానికి మూడు రోజులకు సరిపడా హోమియో మందులను పంపిణీ చేశారు .ఈ మందులు మూడు రోజులపాటు విధిగా ఉదయం లేచిన వెంటనే పెద్దలకు ఆరు మాత్రలు పిల్లలకు మూడు మాత్రలు వంతున వేసుకొని నీరు త్రాగ రాదని కరోనా నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలని లీలామోహన కృష్ణ కోరారు.ఈ కార్యక్రమంలో రేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహనం కృష్ణ ఎం విజయలక్ష్మి ఎం .ఆదిలక్ష్మి కాలనీవాసులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY