అజ్మీర్ కు బయలుదేరిన గూడూరు వైసీపీ మైనారిటీ నాయకులు

0
178

Times of Nellore (Gudur) #కోట సునీల్ కుమార్ #– 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జన నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని జూన్ 9, 2018 న భారత దేశంలో ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం ఐన అజ్మీర్ దర్గా లో వైసీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి మగ్ధుమ్ మొహిద్దీన్ చాదర్ సమర్పించి మొక్కు కోవడం జరిగిందని,కావున ఆ మొక్కును తీర్చుకోవడం కోసం అదే జూన్ 9 న ఢిల్లీ,అజ్మీర్ లకు బయలు దేరుతున్న సందర్భంలో గూడూరు వైసీపీ మైనారిటీ సీనియర్ నాయకులు మొహమ్మద్ అన్వర్ ఆధ్వర్యంలో మైనారిటీలు కలిసి మగ్ధుమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ మా మగ్ధుమ్ భాయ్ ను చూస్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంటుందని అన్నారు, ఎప్పుడు పార్టీ గురించి,మైనారిటీ సమస్యల గురించి తపన పడుతుంటారని అలాంటి మంచి నాయకత్వపు లక్షణాలు మా మగ్ధుమ్ భాయ్ లో ఉన్నాయని అన్నారు
అలాగే మగ్ధుమ్ మాట్లాడుతూ… చాలా చాలా సంతోషంగా ఉందని మన నాయకులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ వారి వారి ఇష్ట దైవాలను ప్రార్ధించడం,మొక్కు కోవడం జరిగింది అని అలాగే నేను కూడా పోయిన సంవత్సరం ఇదే రోజున అజ్మీర్ కు బయలు దేరి పోయానని,ఇపుడు కూడా ఇదే రోజున మొక్కు తీర్చు కోవడం కోసం అజ్మీర్ పోతున్నానని నాతో పాటుగా చెన్నై నుండి ఒకరు అలాగే నెల్లూరు నుండి 16 మంది నా శిష్యులు బయలుదేరి వెళుతున్నామని అన్నారు, ఈ రాష్ట్రం ఇక సుభిక్షంగా ఉంటుందని, కుల,మతాలకు అతీతంగా పాలన మొదలైందని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో అందరికి న్యాయం జరుగుతుందని అన్నారు, గత ప్రభుత్వంలో ముస్లిం కు మంత్రి పదవి ఇవ్వండని నాలుగున్నర సంవత్సరాలు అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు, కానీ ఇప్పుడు ఒక ముస్లిం ఎమ్మెల్యే ను ఉప ముఖ్యమంత్రి గా మైనారిటీ శాఖ మంత్రిగా నియమించిన మన ముఖ్యమంత్రి జగన్ గారిని ఆ అల్లా చల్లగా చూడాలని అజ్మీర్ బయలుదేరినాము అని అన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు వైసీపీ మైనారిటీ సీనియర్ నాయకులు మొహమ్మద్ అన్వర్, మొహమ్మద్ బాసిత్,ఎస్డాన్,కరిముల్లా, జమీర్,నయీమ్, బాబు, గయాజ్,అజీజ్ తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY