స్థానికులకే పట్టం కట్టండి – ఎమ్మెల్యే పాశిం సునీల్

0
90

Times of Nellore (Vakadu) # కోట సునీల్ కుమార్ # – వాకాడు,కోట మండలాల నాయకులు,కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమీక్షా సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. వాకాడు మండలం గొల్లపాళెం, కోట మండలం రెడ్డి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయులతో ఎన్నికల ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ తనను,అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే వరకూ రాత్రి పగలూ కష్టపడి పనిచేయాలని, గ్రామాల వారీగా మరియు బూతుల వారీగా సమీక్షించి నాయకులకు విజ్ఞప్తి చేసారు. కోట మరియు వాకాడు మండలాల్లో పార్టీకి క్యాడర్ పటిష్టంగా ఉందని.,పాత కొత్త నాయకులు కలిసి పనిచేస్తే మరింత మెజారిటీ సాధించవచ్చని నాయకులకు విజ్ఞప్తి చేసారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులతో కలిసి ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి పాశిం సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. కోట పట్టణంలో సత్యం గారికి చెందిన 20-కుటుంబాల వారిని తెలుగుదేశం పార్టీలోకి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కోట మండలం తెలుగు యువత ప్రచార కార్యదర్శిగా సముద్రాల శ్రీనివాసులు, ట్రెజరర్ గా నల్లం వెంకయ్యని నియమించారు.

SHARE

LEAVE A REPLY