అన్న క్యాంటిన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నిరసన!

0
131

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒  –అన్న క్యాంటీన్లు మూసివేయడంపై గూడూరు పట్టణ పురవీధుల్లో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, పేదలకు ఇన్నాళ్లు కడుపునింపిన అన్నపూర్ణ లాంటి అన్న క్యాంటీన్లు మూగబోయాయి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎంతోమంది పూటగడవడానికి, పొట్ట నింపుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వ పాలనని ‘సుపరిపాలన’ అందామా ? అని అన్నారు.ప్రతి రోజు ఎంతోమంది పేదవాళ్ళు, ముసలివాళ్ళు, రోజుకూలీలు, ఏదైనా పనులు కోసం దూరప్రాంతలనుండి వచ్చిన వాళ్ళు బయట హోటళ్లలో 100/- పైనే పెట్టి భోజనం చేయటానికి భయపడి తినకుండా ఉండిపోయే వాళ్ల ఆకలి బాధ తీర్చే అన్నా క్యాంటీన్లను మూసివేయడం మంచిది కాదన్నారు.ఇప్పటికి అయిన ప్రభుత్వం కళ్ళు తెరిసి అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు,కార్యదర్శులు,యువత,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY