గ్యాస్ సిలిండర్ల ఆటో బోల్తా : తప్పిన పెనుప్రమాదం

0
226

Times of Nellore (Gudur) # కోట సునీల్ కుమార్ # – చెన్నూరు మండలం, చెన్నూరు గ్రామ సమీపంలో గ్యాస్ సిలిండర్ లతో వెళుతున్న ట్రాలీ ఆటో అదుపు తప్పి కల్వర్టులో బోల్తాపడింది. గ్యాస్ సిలిండర్లు ఖాళీ వి కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆటో డ్రైవర్ ఆటో ను వదిలేసి పరారయ్యాడు. కల్వర్టు ఉన్న ప్రాంతాలలో సహజంగా రోడ్డు ప్రక్కన పల్లం ఉంటుంది. ఆ ప్రాంతాలలో రక్షణ గోడ నిర్మించాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ప్రమాద సమయంలో ఆటో నడుపుతున్న వ్యక్తి మైనర్ బాలుడని స్థానికులు చెబుతున్నారు. లెసెన్సు లేని డ్రైవర్లను నియంత్రించాల్సిన రవాణా శాఖ అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన సదరు గాస్ కంపెనీ వారు కూడా తక్కువ జీతానికి పనిచేస్తారని మైనర్లను డ్రైవర్లుగా నియమించుకోవడం దారుణం. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు మేల్కొని చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

SHARE

LEAVE A REPLY