దళిత క్రిస్టియన్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

0
116

Times of Nellore (Gudur) – దళిత క్రిస్టియన్లు 2019 ఎన్నికల్లో బిజెపికి సరైన గుణపాఠం చెబుతామని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రిస్టియన్ సౌత్ ఇండియా ప్రధాన కార్యదర్శి జయరాజ్ హెచ్చరించారు. శుక్రవారం గూడూరు పట్టణంలో దళిత క్రిస్టియన్లు నిరసన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం టవర్ క్లాక్ కేంద్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ 1950లో దళితులు క్రిష్టియన్ మతాన్ని తీసుకుంటే వారిని ఉన్నత కులాలుగా పరిగణించాలని చర్యలు తీసుకున్నారు. దీంతో దళితులు రిజర్వేషన్ సౌకర్యాన్ని కోల్పోయారన్నారు. ఆనాటి నుండి దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించాలని కోరుతూ వివిధ సంఘాలు పోరాటం చేస్తూనే ఉన్నారు .. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విషయమై రంగనాథ్ మిశ్రా కమిషన్ను నియమించడం జరిగిందన్నారు. అయితే కమిషన్ సిఫార్సులను అమలుచేసేందుకు కాంగ్రెస్ , బీజేపీలు సహకరించ లేదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన అనంతరం కమిటీ సిఫార్సులను పట్టించుకోలేదన్నారు . దీంతో రాబోవు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దళిత క్రిస్టియన్లు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసి సరైన బుద్ధి చెబుతామన్నారు.

SHARE

LEAVE A REPLY