చెరువులకు సాగునీరు విడుదల చేయండి- మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్!!

0
107

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వర్షాలు కురవవు పోయిన రైతులకు తెలుగుగంగ కాలువ ద్వారా సాగునీరు చెరువులు మరియు స్వర్ణముఖి బ్యారేజీకి అందజేయడం జరిగిందన్నారు . ప్రస్తుతం జిల్లాలో సోమశిల జలాశయం లో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్న ఇప్పటికీ నియోజకవర్గంలోని చెరువులు సాగునీరు విడుదల చేయలేదని ఆరోపించారు . మీడియా సమావేశంలో టిడిపి నాయకులు శ్రీనివాసులు , వెంకటేశ్వర రాజు, శివ కుమార్ , భాస్కర్ రెడ్డి , మాజీ కౌన్సిలర్లు , తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY