సింహ వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి

0
147

Times of Nellore (Gudur) #కోట సునీల్ కుమార్ # – గూడూరు పట్టణంలోని కర్ణాలవీధి వెలసివున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు . స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు . వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి ప్రకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు . .

SHARE

LEAVE A REPLY