ఉపాధ్యాయుని ఆత్మకూరు భారతికి “ఆనంద పాఠశాల” పురస్కారం

0
146

Times of Nellore (Guntur) # సూర్య # – గుంటూరులోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నందు “విద్యా వికాస సమితి” ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో జ్ఞానోత్సవం 2019 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా, వాకాడు మండలం, రెడ్డిపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని ఆత్మకూరు భారతి ఆనంద పాఠశాల పురస్కారం అందుకున్నారు. పాఠశాలల్లో విద్యలో చేస్తున్న వినూత్న ప్రయోగాలకు గాను, విద్యా వికాస సమితి జాతీయ కార్యదర్శి అతుల్ కొఠారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.సీ.ఈ.ఆర్.టి టెక్స్ట్ బుక్స్ కో-ఆర్డినేటర్ టీవీఎస్ రమేష్, విద్యావికాస సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు దశపతి రావు, రఘురాం శ్రీనివాస్, పూడి ప్రసాద్ పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY