స్వామి వివేకానంద అందరికి ఆదర్శం – మనోజ్ కుమార్

0
77

Times of Nellore (Gudur)  # కోట సునీల్ కుమార్ #- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యువజనోత్సవాల సందర్భంగా వి ఎస్ ఆర్ పాఠశాలలో సెమినార్ నిర్వహించారు . ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద ఆయన అడుగుజాడలలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. 1863 జనవరి 12వ తేదీన కోల్కతా నగరంలో జన్మించిన స్వామి వివేకానంద గారు చికాగో మహాసభలలో భారతదేశ గొప్పతనాన్ని తెలియజేశారని ఆయన తెలిపారు. భారతదేశంలో ఇప్పటికి కూడా యువత దేశ నాయకులను స్వతంత్ర నాయకులు మరిచిపోతున్నారని అలా కాకుండా స్వామి వివేకానంద మరియు దేశ స్వతంత్ర నాయకులని గుర్తు చేసేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర విద్యార్థులకు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. మరియు మాజీ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ వివేకానంద గారిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన కోరారు దేశం కోసం పాటుపడిన గొప్ప నాయకుల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని వాళ్ళ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాము గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న డివిజన్ కార్యదర్శి రవి నగర కార్యదర్శి కార్తీక్ కార్యకర్తలు జార్జ్ మరియు శ్రీకాంత్ పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY