గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన!!

0
68

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమ బోధనను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గూడూరులోని సి ఎస్ ఎం పాఠశాల సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ తెలుగు మాధ్యమ బోధనను రద్దు చేయడం అత్యంత దురదృష్టకరమని ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖలోని పలు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడానికి అవకాశం ఉంది తెలుగు మాధ్యమంలో బోధనను రద్దు పరచుకోవడం అనాలోచిత చర్య..ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి ఆంగ్ల మాధ్యమ నిష్ణాతులుగా మార్చాలనూకోవడం అవివేకమన్నారు. ఆంగ్ల మాధ్యమ బోధనకు గానూ ప్రత్యేక శిక్షణ, అర్హత కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి పాఠశాలలను ప్రారంభిస్తే ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న నగర కార్యదర్శి శ్యామ్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జార్జ్ నగర సహాయ కార్యదర్శి హర్షవర్ధన్ కిరణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY